టాలీవుడ్ లో జర్నీ స్టార్ట్ చేసి అంచెల అంచెలుగా ఎదిగి, పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు ప్రభాస్. విదేశాల్లో కూడా ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్ గా సలార్ సినిమాతో తనకున్న ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన హీరో లేరన్న విషయాన్ని మరొకసారి నిరూపించాడు. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ బిజీ గా ఉన్న ప్రభాస్ సరసన నటించటానికి అన్ని బాషల హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కెరియర్ ప్రారంభంలో కొందరు బాలీవుడ్ భామలు ప్రభాస్ కి నో చెప్పారు.
ప్రభాస్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా మొదట ప్రియాంక చోప్రాను తీసుకోవాలి అన్న ఆలోచనతో ఆమెను సంప్రదించగా నో చెప్పిందట ప్రియాంక. దాంతో కంగనా రనౌత్ ను తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కి వచ్చిన ఫేమ్ కారణంగా ప్రియాంకా చోప్రా ప్రభాస్ తో నటించాలని కలలు కంటోందని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని టాక్.
కానీ అప్పుడు తనని రిజక్ట్ చేసిన కారణంగా ప్రభాస్ ప్రియాంక చోప్రాకి నో చెప్పాడని సమాచారం. ఒకసారి తనతో నటించటానికి నో చెప్పిన వ్యక్తి ఇప్పుడు తనకున్న పేరు కారణంగా తనతో కలిసి వర్క్ చేస్తానంటే డార్లింగ్ కూడా ఇప్పుడు ఒప్పుకోలేదని తెలుస్తోంది. టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనేమో. ప్రియాంక ఆశలు ఇక నెరవేరనట్లే. ప్రభాస్, చేయబోయే సినిమాల కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకప్పుడు సౌత్ సినీ పరిశ్రమని తక్కుచేసి మాట్లాడిన నార్త్ వాళ్ళు, ఇప్పుడు సౌత్ సినిమాలకోసం క్యూ కడుతున్నారు. ఒకప్పుడు మన హీరోలగూర్చి హేళనగా మాటాడిన ఉత్తరాది భామలు ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వెంట పడుతున్నారు.