తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లని ఎందుకు తీసుకోరు? ఈ రొటీన్ ప్రశ్నని కొన్ని వేల ఇంటర్వ్యూలలో కొన్ని వేల సార్లు దర్శక-నిర్మాతలకి ఎదురైనా ప్రశ్న. దానికి వారి సమాధానం కూడా అదే రొటీన్ గా “తెలుగు అమ్మాయిలు ముందుకి రారండి.. వచ్చినా కూడా మా కథకి సరిపోరు”.
అయితే ఈ రొటీన్ మాటలకి చెక్ పెడుతూ ఈమధ్యన కొందరు తెలుగు హీరోయిన్లు టాలీవుడ్ లో తమదైన ముద్రని కనబరుస్తున్నారు. అందులో తాజాగా ఎంట్రీ ఇచ్చన హీరోయిన్- ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది. సినిమాలో ఆమె నటనతో అందరిని ఆకట్టుకోగా ఆమె ఆఫ్ స్క్రీన్ లో ఇంటర్వ్యూలలో మాట్లాడే విధానం, సినిమాల పై అభిప్రాయం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకి ఆమె చెప్పిన సమాధానాలు అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇవి ఆమెని ఒక రెగ్యులర్ హీరోయిన్స్ లా కాకుండా ఒక స్పెషల్ హీరోయిన్ గా అందరికి కనిపించేలా చేస్తున్నాయి. ఒక పక్కింటి అమ్మాయి లేదా మనకి తెలిసిన ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది.
ఇక ఇప్పుడు తొలిచిత్రమే హిట్ అవ్వడంతో కెరీర్ పరంగా మంచి ఆరంభం దొరికిందనే చెప్పాలి. ఇప్పటికున్న ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే కచ్చితంగా చాలా ఎక్కువ కాలమే ఇండస్ట్రీలో నిలదోక్కుకునేలా ఉంటుంది అని ఆశించొచ్చు.
గుడ్ లక్ ప్రియాంక...