తమిళ అగ్ర నటుల్లో ఒకరైన విశాల్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ నటించనుందనీ తాజా సమాచారమ్. అయితే హీరోయిన్‌గా కాదులెండి. ఓ ఐటెం సాంగ్‌లో. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' చిత్రాన్ని విశాల్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఐటెం సాంగ్ కోసం సన్నీలియోన్‌ని తీసుకున్నారనీ తాజా సమాచారమ్.
ఈ సినిమాలో సన్నీకి ఛాన్సిచ్చింది విశాలేనట. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా సన్నీలియోన్‌కి తిరుగే లేదు. పోర్న్ రంగం నుండి వచ్చినా అక్కడ నటిగా మంచి పేరు దక్కించుకుంది సన్నీలియోన్. ఆ మాటకొస్తే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఆమెకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌తోనే ఈ మధ్య సౌత్ సినిమాలపై సన్నీలియోన్ దృష్టి పెట్టింది కూడా. ఆ దిశగా ఆల్రెడీ తెలుగులో 'గరుడవేగ' సినిమాలో ఐటెం సాంగ్‌తో మెప్పించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. త్వరలోనే 'వీరమహాదేవి' చిత్రంతో తెలుగు, తమిళ, కన్నడ తదితర భాషల్లో ఏకకాలంలో అలరించనుంది.
అయితే అసలు ట్విస్ట్‌ం ఏంటంటే సన్నీ నటిస్తున్న 'వీరమహాదేవి' సినిమాపై కొంమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కన్నడిగులు చాలా పవిత్రంగా భావించే వీరనారి వీరమహాదేవి పాత్రలో సన్నీలియోన్ వంటి పోర్న్ స్టార్ నటించడమేంటనీ ఈ మధ్య ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి విశాల్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆ దిశగానే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట అని కోలీవుడ్ వర్గాల సమాచారమ్.
'అయోగ్య' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సన్నీలియోన్‌తో ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తైందనీ తెలుస్తోంది.