ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు ప్రియాంకా జవాల్కర్. అమ్మాయిలందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్నట్లే ఈ అమ్మాయికి కూడా చాలా ఇష్టమట.
అయితే ఈ బ్యూటీ ఎప్పటి నుండి పవన్ కళ్యాణ్‌కి ఫ్యానో తెలుసా? ఎనిమిదేళ్ల వయసు నుండే పవన్‌కి పెద్ద ఫ్యాన్ అట. పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' సినిమా చూసినప్పటి నుండీ ఆయనకు ఫ్యాన్ అయిపోయిందట. పవర్‌స్టార్ ఫ్యాన్ అని చెప్పడం బాగానే ఉంది. కానీ, ఈ బ్యూటీ ఒక్క విషయం మర్చిపోయినట్లుంది. అప్పటికి తనకు ఎనిమిదేళ్లు అని చెప్పడంతో ఆమె వయసు ఇప్పుడు ఎంతుంటుందా అని లెక్కలు కట్టేయడం మొదలెట్టేశారు.
చిన్న లెక్కే కదా. మీరూ ఓ లెక్కేస్కోండి. అమ్మడి వయసెంతో మీకే తెలుస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం 'టాక్సీవాలా' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.