పవన్ కళ్యాణ్ సినిమాలపై రోజుకొక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఏపీ రాజకీయాల్లో బిజీ గా ఉన్న పవన్ ప్రజంట్ సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల తరవాత తాను కమిట్ అయిన సినిమాలని కంప్లీట్ చేస్తానని నిర్మాతలకి మాట ఇచ్చారు. ఈ లోగా పవన్ సినిమాలపై రోజు కొక బజ్ క్రియేట్ అవుతోంది. మొన్నటివరకు పవన్ తో క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు ఆగిపోయిందని కొన్నాళ్ళు. పవన్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి గా లేరని అందుకే ఆ మూవీని పక్కన పెట్టారని. ఇంకొన్నాళ్ళు క్రిష్ తప్పుకున్నాడని వేరే డైరక్టర్ ఈ మూవీని పట్టాలెక్కించి పనిలో ఉన్నాడని, ఇలా రోజు కొక న్యూస్ హల్చల్ చేసింది. ఒక్క అప్డేట్ తో ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. ఈ మూవీ విజువల్ ట్రీట్ కి రెడీగా ఉండండి అంటూ అనౌన్స్ చేస్తూ అందరి నోళ్లు మూయించారు.
అంతే కాదు ఈ మూవీ గూర్చి ఇంకో న్యూస్ కూడా బయటికి వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా గురించి నిర్మాత ఏం రత్నం తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." పవన్ కళ్యాణ్ తో ఏదో ఒక సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలంటే ఓ 20 రోజులు ఆయన డేట్స్ ఎలాగోలా తీసుకుని సినిమా చేసే వాడిని. కానీ ఆయనతో చేసే సినిమా ఎప్పటికి గుర్తుండిపోవాలి. ఇండియా లెవెల్ లో ఆయన ఏంటో తెలియాలి అనే స్థాయిలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాం. వైసీపీ మీడియా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేస్తోంది. కానీ అందులో వాస్తవం లేదు. హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా ఉంటుంది" అంటూ క్లారిటీ ఇచ్చారు.
ప్రజంట్ టాలీవుడ్ లో అన్ని సినిమాలు సీక్వెల్స్ గా రానున్నాయి. ఇదొక ట్రెండ్ అయిపోయింది. పార్ట్ పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ ట్రెండ్ ని రాజ మౌళి స్టార్ట్ చేశారు. బాహుబలి సినిమా రెండు పార్టులుగా వచ్చి వరల్డ్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. తరవాత ప్రభాస్ 'సలార్' బన్నీ పుష్ప మూవీ కూడా సెకండ్ పార్ట్ త్వరలో రిలీజ్ కానున్నాయి. ఎన్టీఆర్ దేవర రెండు భాగాలు అని ముందే అనౌన్స్ చేశారు. అందుకే హరి హర వీరమల్లు కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ రెండో భాగం కూడా ఉంటుందని నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ దిల్ ఖుషిగా ఉన్నారు.