చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాత్రికేయుడు, పీఆర్వో, పత్రికాధినేత, నిర్మాత బిఏ రాజు మృతి చిత్రసీమని కలిచివేస్తోంది. ఎవరి నోట విన్నా. బిఏ రాజు మాటే. ఓ ఆప్తుడిని కోల్పోయిన ఆవేదన అందరిలోనూ కనిపిస్తోంది. స్టార్స్ అందరికీ బిఏ రాజు సుపరిచితుడు. వాళ్ల ఇంటి సభ్యుడిలా మసిలాడు. అలాంటి బిఏ రాజు లేకపోవడం... దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా కృష్ణ కుటుంబంతో రాజుకి అవినాభావ సంబంధం ఉంది. కృష్ణకి వీరాభిమాని అయిన రాజు.. ఆయన ప్రోగ్బలంతోనే చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
మహేష్ బాబుని చిన్నప్పటి నుంచీ ఎత్తుకుని పెంచారు. మహేష్ కి బిఏ రాజు అంటే మమకారం ఎక్కువ. రాజు మరణ వార్త తెలుసుకొని, రాత్రికి రాత్రి.. మహేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. చిరంజీవి, నాని, విశాల్ లాంటి స్టార్లంతా.. ట్విట్టర్ వేదికగా తమ సంపాతాన్ని వ్యక్తం చేశారు.
ఇక పాత్రికేయ లోకం గురించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్లంతా.. విషాదంలో మునిగిపోయారు. ఏ పాత్రికేయుడి మరణం కూడా... ఇలా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారలేదంటే.. టాలీవుడ్ లో రాజు స్థానం ఏమిటో అర్థం చేసుకోవొచ్చు.