ప్రముఖ సీనియర్ నిర్మాత అయిన కేసీ శేఖర్ బాబు గుండెపోటుతో మృతి చెందారు.
అందుతున్న వివరాల ప్రకారం, ఈ రోజు ఉదయం జర్నలిస్ట్ కాలనీలోని తన స్వగృహంలో అకస్మాతుగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు కుటుంబసబ్యులు తెలియచేశారు. మే 1, 1946లో జన్మించిన ఈయన తన తండ్రి డిస్ట్రిబ్యూటర్ అవ్వడంతో సినీ రంగంలో ప్రవేశించి మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి అలాగే మెగా స్టార్ చిరంజీవితో ముఠామేస్త్రి సినిమాలని నిర్మించాడు.
అలాగే ఈయన ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలిలో కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. శేఖర్ బాబు గారి అంత్యక్రియలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సందర్భంగా ఇక్లిక్ మూవీస్ తరుపున కేసీ శేఖర్ బాబు కుటుంబసబ్యులకి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.