వర్మ తీసిన `పవర్ స్టార్` ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలో వర్మ చూపించిన పాత్రల గురించీ, సన్నివేశాల గురించీ జనం మాట్లాడుకుంటున్నారు. ఇందులో త్రివిక్రమ్ ని పోలిన పాత్ర ఉంది. పవన్ త్రివిక్రమ్ ని కొట్టినట్టుగా ఓ సీన్ లో చూపించారు. త్రివిక్రమ్‌ని కాపీ దర్శకుడిగా ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఈ విషయంపై త్రివిక్రమ్ స్పందించలేదు గానీ, ఆయన సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత నాగవంశీ పరోక్షంగా వర్మని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
`ఈ రోజుల్లో సెన్సేషనలిజమ్ అనేది సాధారణంగా మారిపోయింది. తమ మనుగడ కోసం వేరు వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే రాబంధులు ఎక్కువైపోయాయి. ఇలాంటి వారికి సిగ్గు ఉండదు. వారితో పోరాటం చేయడానికి ఏకైక మార్గం వారిని పట్టించుకోకపోవడమేన`ని నాగవంశీ ట్వీట్ చేశారు. కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా అంటూ `అరవింద సమేత`లో ఎన్టీయార్ డైలాగ్ చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత చిత్రానికి నిర్మాత నాగవంశీనే.
Sensationalism has become a Norm of Society these days. There are vultures & witches at every turn who just target everyone for their survival. These scavengers have no shame and the best solution to fight them is not to "Hate" but Ignore them! pic.twitter.com/1zSpiRZ4KT
— Naga Vamsi (@vamsi84) July 25, 2020