'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

By iQlikMovies - July 25, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

నటీనటులు :  ప్రవన్ కళ్యాణ్, కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ తదితరులు 
దర్శకత్వం :  రామ్ గోపాల్ వర్మ
సంగీతం : డి ఎస్ ఆర్ 
సినిమాటోగ్రఫర్ : జోషి 

 

సినిమాలు లేక‌, వాటి ఊసు లేక బోసి పోతున్నారు సినీ ప్రియులు. అలాంటి వాళ్ల‌కు ఏదో ఓ రూపంలో వినోదం అందించాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే ఏటీటీ ద్వారా రెండు సినిమాల్ని వ‌దిలాడు. ఇప్పుడు మూడో సినిమా `ప‌వ‌ర్ స్టార్‌` సిద్ధం చేశాడు. ఇది వ‌ర‌కటి సినిమాల‌కు లేని మైలేజీ.. ఈ `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. కార‌ణం... ఆ పేరులో ఉన్న మ్యాజిక్‌. `ఎన్నిక‌ల త‌ర‌వాత క‌థ‌` అంటూ... ప్ర‌వ‌న్ క‌ల్యాణ్ అనే ఓ క‌థానాయ‌కుడి సినీ, రాజ‌కీయ జీవితాన్ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.


* క‌థ‌


ప్ర‌వ‌ణ్ క‌ల్యాణ్ ఓ హీరో. రాజ‌కీయాల్లో అడుగుపెట్టి.. పార్టీ స్థాపించి.. ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోతాడు. తాను రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క సీటూ గెల‌వ‌డు. ర‌ష్య‌న్ భార్య‌కు... ప్ర‌వ‌ణ్ బాధ అర్థం కాదు. అన్న‌య్య‌లు.. చెరో ర‌కం. ఒక‌రు `సినిమాలు తీస్కో` హాయిగా అంటే.. మ‌రొక‌రు ఫోన్లో ఎవ‌రో తిట్టిన తిట్ల‌ని గుర్తు చేస్తూ మ‌రింత బాధ పెడుతుంటాడు. గండ్ల ర‌మేష్ `మీరు ఓడిపోవాల‌ని మొక్కుకున్నా` అంటాడు. న‌మ్మిన ద‌ర్శ‌కుడేమో.. `మీరు ఈ గ్యాప్ లో మ‌రో సినిమా తీయండి` అని స‌ల‌హా ఇస్తాడు. ఇంత‌మంది స‌ల‌హాలూ, సూచ‌న‌ల మ‌ధ్య ప్ర‌వ‌న్ ఎవ‌రి మాట విన్నాడు?  చివ‌రికి ఏ నిర్ణ‌యం తీసుకున్నాడు?  అనేదే `ప‌వ‌ర్ స్టార్‌`.


* విశ్లేష‌ణ‌


32 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఇది. ట్రైల‌ర్ లో ఏం చూపించాడో.. ఎన్ని పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేశాడో.. సినిమాలోనూ అదే ఉంది. అన్నే పాత్ర‌లున్నాయి. ఎన్నిక‌ల్లో ఓడిపోయాన‌న్న ప్ర‌వ‌న్ ఫ‌స్ట్రేష‌న్ తో సినిమా మొద‌లెట్టాడు. అన్న‌య్య వ‌చ్చి స‌ల‌హా ఇవ్వ‌డం, చంద్ర‌బాబు ని పోలిన పాత్ర వ‌చ్చి ఓదార్చ‌డం, త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడు వ‌చ్చి సినిమా క‌థ చెప్ప‌డం... ఇలా వ‌రుస బిట్లు బిట్లుగా సాగింది సినిమా. వ‌ర్మ‌కి సెటైరిక‌ల్ థాట్స్ బాగా వ‌స్తాయి. త‌న ట్విట్ట‌ర్ లో అవే క‌నిపిస్తుంటాయి. ఇక్క‌డా ఆ ప్ర‌తాపం చూపించాడు. దాదాపు ప్ర‌తీ సీన్‌లోనూ ఓ సెటైర్ ఉంటుంది. అది ప‌వ‌న్ పై కావొచ్చు, బండ్ల గ‌ణేష్ పై కావొచ్చు. త్రివిక్ర‌మ్ పై, నాగ‌బాబుపై, చిరంజీవిపై... ఎవ‌రినీ వ‌ద‌ల్లేదు. పూణె నుంచి ఫోన్ రావ‌డాన్ని కూడా సెటైరిక‌ల్ గానే వాడుకున్నాడు. ఆఖ‌రికి క‌త్తి మ‌హేష్ పైనా సెటైర్లేశాడు.


సెవ‌న్ ఓ క్లాక్ బ్లేడు వ్య‌వ‌హారాన్ని కూడా వాడుకున్నాడు వ‌ర్మ‌. `నా బ‌యోపిక్ లో మ‌రొక‌రికి ఛాన్స్ ఇస్తావా` అంటూ.. గండ్ల ర‌మేష్ ని ప్ర‌వ‌న్ త‌రిమి త‌రిమి కొడ‌తాడు. అది బాగా పేలింది.


చివ‌ర్లో ఎంట్రీ ఇచ్చాడు వ‌ర్మ‌. ప‌వ‌న్‌ని ఉద్దేశించి చెప్పిన డైలాగులు త‌ప్ప‌కుండా ప‌వ‌న్ ఫ్యాన్స్ కి న‌చ్చుతాయి. `ప్ర‌పంచంలోని మీ అతి పెద్ద అభిమానిని నేనే` అంటూ చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇజం పుస్త‌కంపైనా సెటైర్లు ప‌డ్డాయి. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ని హిందీలో విడుద‌ల చేయొద్ద‌ని అప్ప‌ట్లో ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. అస‌లు ఆ ట్వీట్ వెనుక కార‌ణాన్ని ఇప్పుడు చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ప‌వ‌న్ కాలి కింద కూర్చున్న వ‌ర్మ‌ని చూస్తే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ని శాంత‌ప‌ర‌చ‌డానికి వ‌ర్మ ప్ర‌య‌త్నించాడేమో అనిపించ‌క‌మాన‌దు. చివ‌ర్లో ప‌వ‌న్ - వ‌ర్మ గ‌ట్టిగా కౌలిగించుకోవ‌డంతో క‌థ ముగుస్తుంది.


* న‌టీన‌టులు


ప్ర‌వ‌న్ గా ఎంపిక చేసిన న‌టుడు.. ఆ పాత్ర‌కు న్యాయం చేశాడు. డ‌బ్బింగ్ కూడా బాగా కుదిరింది. క్లోజ‌ప్ లు లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు వ‌ర్మ‌. అలా పెట్టిన ఒక‌ట్రెండు షాట్స్ లో `వీడు ప‌వ‌నేంటి?` అనిపిస్తుంది. లాంగ్ షాట్స్ లో అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణేనేమో అన్న భ్ర‌మ క‌లుగుతుంది. చివ‌ర్లో వ‌ర్మ కూడా న‌టించేశాడు. సాధార‌ణంగా టీవీ ఇంట‌ర్వ్యూల‌లో వ‌ర్మ ఎలా మాట్లాడ‌తాడో, ఎలా వ్య‌వ‌హ‌రిస్తాడో అలానే న‌టించాడు. చిరు, బండ్ల గ‌ణేష్‌, త్రివిక్ర‌మ్.. ఇలా అంద‌రూ సూటైపోయారు (లాంగ్ షాట్స్ లో మాత్ర‌మే).


* సాంకేతిక వ‌ర్గం


టెక్నిక‌ల్ గా గొప్ప‌గా ఏం లేదు. చివ‌ర్లో వ‌ర్మ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో మాస్ హీరోకి ఇచ్చే బ్యాంగ్ అది. గ‌డ్డి తింటావా పాట జ‌నం ఇది వ‌ర‌కే చూసేశారు. ఈ సినిమాలో ఉన్న పాట అదొక్క‌టే. త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమాని పూర్తి చేశాడు వ‌ర్మ‌. ఆర్థికంగా చూస్తే.. లాభాలు తెచ్చే ప్రాజెక్టే అనిపిస్తుంది.


* ప్ల‌స్ పాయింట్స్
పేలిన సెటైర్లు
క్లైమాక్స్‌


* మైన‌స్ పాయింట్స్‌
కొత్త విష‌యాలేం లేవు


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  సెటైర్ స్టార్‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS