ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించేశాడు ప్రశాంత్ నీల్. `కేజీఎఫ్`తో ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దాంతో.. టాలీవుడ్ టాప్ హీరోలు ప్రశాంత్ నీల్ ని పిలిపించుకుని మరీ.. కథలు విన్నారు. కేజీఎఫ్ ఊపులో ప్రశాంత్ నీల్ కి ఛాన్సులిచ్చిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. అటు ప్రశాంత్ నీ, ఇటు ఎన్టీఆర్ నీ.. మైత్రీ మూవీస్ సంస్థ కలిపింది.
అయితే... కేజీఎఫ్ తరవాత.. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ఫిక్సవ్వడంతో.. ఎన్టీఆర్ తో సినిమా లేదని భావించారంతా. అయితే ఈ ప్రాజెక్టు పై మైత్రీ స్పందించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా ఉంటుందని తేల్చేసింది. సలార్ అయిపోయిన వెంటనే ఈ కాంబో పట్టాలెక్కుతుందని క్లారిటీ ఇచ్చింది. సో.. కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయడం.. గ్యారెంటీ అన్నమాట.
ప్రస్తుతం సలార్ పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2022లోనే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోని చూసే ఛాన్సుంది.