ప‌వ‌న్ సినిమాకి బాలీవుడ్ హంగులు

By Gowthami - February 27, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `విరూపాక్ష‌` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతోతున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమాని పెద్ద స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. అందుకోసం బాలీవుడ్ న‌టీన‌టుల్ని ఈ సినిమా కోసం ఎంపిక చేయ‌నున్నారు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. ఓ ద‌శ‌లో సంజ‌య్ ద‌త్ అనుకున్నారు. ఇప్పుడు అర్జున్ రాంపాల్‌ని తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లున్నారు.

 

ఓ క‌థానాయిక‌గా ప్ర‌గ్యా జైస్వాల్‌ని ఇది వ‌ర‌కే ఎంపిక చేశారు. ఇప్పుడు రెండో క‌థానాయిక కూడా ఖ‌రారైంది. జాక్వెలెన్ ఫెర్నాండేజ్‌ని ప్ర‌ధాన నాయిక‌గా తీసుకున్నార‌ని తెలుస్తోంది. వీళ్లే కాదు.. బాలీవుడ్ నుంచి మ‌రికొంత‌మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఈ సినిమా కోసం తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏఎం ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS