ప్రబాస్‌ ప్యాన్‌ ‘ఇండియా’ కాదు ప్యాన్‌ ‘వరల్డ్‌’ మూవీ.!

By Inkmantra - February 27, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ప్రబాస్‌ ` నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ అయిన సంగతి తెలిసిందే. ప్యాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాని అభివర్ణిస్తుంటే.. కాదు కాదు, ప్యాన్‌ ఇండియాని ప్రబాస్‌ ఎప్పుడో కొట్టేశాడు. ఇప్పుడిది ప్యాన్‌ వరల్డ్‌ మూవీ కాబోతోంది అంటూ డైరెక్టర్‌ నాగ అశ్విన్‌ చెప్పడం అందర్నీ విస్మయ పరుస్తోంది. ‘బాహుబలి’ ప్యాన్‌ ఇండియా మూవీ అయ్యిందంటే ఆ లెక్కలు వేరు. దాన్ని ప్రామాణికంగా తీసుకుని తెరకెక్కించిన ‘సాహో’ సంగతి ఏమైందో చూశాం.. ఈ లెక్కల్ని పక్కాగా తీసుకున్న సినీ ప్రియులు కొందరు, ప్రబాస్‌ ఇమేజ్‌తో ఆటలాడుకోవడం ఎంతవరకూ సబబు.? అంటున్నారు. నిర్మాణానికి ముందే ఈ స్థాయిలో అంచనాలు పెంచేయడం కరెక్ట్‌ కాదంటూ సీరియస్‌గా చర్చ జరుగుతోంది. అయితే, నాగ అశ్విన్‌ టాలెంట్‌ ఉన్న డైరెక్టరే.

ప్రబాస్‌ ఇమేజ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అంచనాలు పెంచితే బావుంటుందనేది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. ఈ రోజు కాదు, రేపు కాదు, ఈ ఏడాది చివర్లో సినిమా స్టార్ట్‌ కానుంది. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ అవుతుందేమో. ఈ లోగా ఈ సినిమాపై ఇంత భారీ చర్చ అవసరమా.? అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రబాస్‌ నటిస్తున్న ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) స్టేటస్‌ ఏంటనేది ఇంకా తెలియ రావడం లేదు. రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కింది. షూటింగ్‌ కూడా రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంది. కానీ, ఇంతవరకూ కొలిక్కి రాకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఒక్క ఫస్ట్‌లుక్‌ తప్ప ఇంతవరకూ ఈ సినిమా అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS