పవర్‌ స్టార్‌ స్టైల్‌లో ‘వకీల్‌ సాబ్‌’ వచ్చేశాడు!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీమేక్‌ మూవీకి ‘వకీల్‌ సాబ్‌’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందాకే ఫస్ట్‌లుక్‌తో కూడిన టైటిల్‌ని అధికారికంగా రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అందనంత రేంజ్‌లో ఈ లుక్‌ ఉండేసరికి ఫ్యాన్స్‌ ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఓ కుర్చీలో కూర్చొని ముందు మరో చెక్క కుర్చీకి కాళ్లు దన్ను పెట్టి చేతిలో బుక్‌ పట్టుకుని పవర్‌ స్టార్‌ కనిపిస్తున్నాడు. సిట్యువేషన్‌ చూస్తుంటే, ఓ ఇంపార్టెంట్‌ కేసు వాదించడానికి టాటా ఏస్‌ వాహనంలో సరంజామా వేసుకుని మన వకీల్ సాబ్ బయుదేరుతున్న సిట్యువేషన్‌లా కనిపిస్తోంది. మొత్తానికి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌తో అద్దరగొట్టేశాడు పవర్‌ స్టార్‌.

 

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సమ్మర్‌ స్పెషల్‌గా మే లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అన్ని రకాల కమర్షియల్‌ వాల్యూస్ తో హైలీ టెక్నికల్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ స్టిల్‌తోనే పవర్‌ చూపించిన పవర్‌ స్టార్‌, ‘వకీల్‌ సాబ్‌’తో ఎలాంటి సంచనాలు సృష్టించబోతున్నాడో చూడాలంటే సమ్మర్‌ వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS