ప‌వ‌న్ మొద‌లెట్టేశాడు... చిరు వ‌స్తున్నాడు

By iQlikMovies - July 26, 2021 - 14:33 PM IST

మరిన్ని వార్తలు

లాక్ డౌన్ త‌ర‌వాత‌.. షూటింగుల హ‌డావుడి మ‌ళ్లీ మొద‌లైంది. స్టార్సంతా సెట్స్‌పైకి రావ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ మేక‌ప్‌వేసుకున్నాడు. ప‌వ‌న్ , రానా క‌థానాయ‌కులుగా `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్` రీమేక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ ... వ‌ర్షాల కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లైంది. ఈరోజు నుంచి హైద‌రాబాద్ లో షూటింగ్ పునః ప్రారంభిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సెట్లో అడుగుపెట్టేశాడు. ప్ర‌సాద్ మూరెళ్ల ఈ చిత్రానికి కెమెరామెన్‌. అయితే ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో ర‌వి కె.చంద్ర‌న్ కెమెరాబాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌సాద్ మూరెళ్ల తీసిన స‌న్నివేశాల్ని ఇప్పుడు రీషూట్ చేయ‌బోతున్నార‌ని టాక్‌.

 

మ‌రోవైపు... చిరు కూడా సెట్లోకి రావ‌డానికి రెడీ అవుతున్నాడు. చిరంజీవి క‌థానాయ‌కుడిగా `లూసీఫ‌ర్‌` రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు 11 నుంచి మొద‌ల‌వుతుంది. ఈలోగా `ఆచార్య‌` షూటింగ్ కూడా పూర్త‌వుతుంద‌ని టాక్‌. `లూసీఫ‌ర్‌` రీమేక్ లో క‌థానాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌య‌నతార దాదాపుగా ఖ‌రార‌య్యే ఛాన్సుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS