ప‌వ‌న్ టైటిల్ పై.. త్రివిక్ర‌మ్ స్టాంప్‌

మరిన్ని వార్తలు

త్రివిక్ర‌మ్ సినిమా క‌థ‌లు.. టైటిళ్లు, పాట‌లు.. అచ్చ‌మైన తెలుగులోనే ఉంటాయి. తెలుగు భాషా ప్రేమికుడు కాబ‌ట్టి... ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడాయ‌న‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా టైటిల్ విష‌యంలోనూ... ఇదే ముద్ర క‌నిపించ‌బోతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా కాంబినేష‌న్‌లో `అయ్యప్పనుమ్ కోషియం` రీమేక్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. అయితే స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌ల్ని త్రివిక్ర‌మ్ స‌మ‌కూరుస్తున్నాడు. అందుకుగానూ.. త్రివిక్రమ్ కి భారీ పారితోషికంతో పాటు, లాభాల్లో వాటా ముడుతోంది. అందుకే అడుగ‌డుగునా ఈ సినిమాపై త్రివిక్ర‌మ్ అజ‌మాయిషీ న‌డుస్తోంది. టైటిల్ బాధ్య‌త‌ని సైతం త్రివిక్ర‌మ్ తీసుకున్నాడు.

 

దానికి త‌గ్గ‌ట్టే, ఆయ‌న స్టైల్ లో ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స‌యిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి `పరశురామ కృష్ణమూర్తి` అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అప్ప‌య్య‌న్‌, కోషి కురియ‌న్‌.. అనే ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఈగో స‌మ‌స్యేఅయ్యప్పనుమ్ కోషియం కథ‌గా మారింది. అంటే... రెండు పాత్ర‌ల పేర్లు క‌లిపి పెట్టార‌న్న మాట‌. ఇక్క‌డా అంతే. ప‌ర‌శురామ కృష్ఱ‌మూర్తి అనే రెండు పాత్ర‌ల పేర్లు క‌లిసేలా... ఈ టైటిల్ ఖరారు చేశార్ట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించారు. అలా.. ఈ టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS