'బిగ్‌' టాపిక్‌: పునర్నవిని ఆ ఇద్దరూ హేట్‌ చేస్తున్నారా?

మరిన్ని వార్తలు

బిగ్‌హౌస్‌లో పునర్నవి భూపాళం రూటే సెపరేటు. డే వన్‌ నుండీ, డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ ప్రదర్శిస్తోంది. అవసరమైన చోట ఆ ఆటిట్యూడ్‌ ప్రదర్శిస్తూ, షో మొత్తానికి హైలైట్‌ అవుతోంది. బయటి నుండి కూడా పునర్నవికి ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక హౌస్‌లో తన ఆటిట్యూడ్‌తో తాను చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని అందరిలోనూ బలమైన ముద్ర వేయించేసుకుంది. అందుకే శ్రీముఖి, హిమజ ఆమెను బాగా హేట్‌ చేస్తున్నారు.

 

పునర్నవి ఆటిట్యూడ్‌ని తప్పు పడుతున్నారు. తను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటుందనీ, దగ్గరికి వెళ్లి మాట్లాడాలని ప్రయత్నించినా, నో.. నా దగ్గర పెద్దగా ఇష్యూస్‌ ఏమీ లేవు. సారీ.. అంటూ తప్పించుకుని వెళ్లిపోతుందట. వితికా, రాహుల్‌, వరుణ్‌.. ఇలా తనకు నచ్చన వాళ్లతోనే పునర్నవి క్లోజ్‌గా ఉంటుందని, ఈ పద్ధతి మంచిది కాదని హిమజ శ్రీముఖితో గుసగుసలు ఆడుతోంది. శ్రీముఖి కూడా హిమజ మాటలకు వంత పాడుతోంది. శ్రీముఖికి కూడా పునర్నవిపై పీకల దాకా ఉంది.

 

పునర్నవి కారణంగానే, తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన రాహుల్‌, తనను అవైడ్‌ చేస్తున్నాడనీ, హౌస్‌లో శత్రువులా మారిపోయాడనే అభిప్రాయముంది. దాంతో పునర్నవిపై ఈ ఇద్దరూ కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు. హౌస్‌లో అలా ఉంటే, పునర్నవి ఆటిట్యూడ్‌ హౌస్‌ నుండి కాకుండా, బయటి నుండి చూస్తున్న వీక్షకుల్ని బాగా మెప్పిస్తోంది. ఏది ఏమైనా టాప్‌ 5 కంటెస్టెంట్స్‌లో పునర్నవి ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకం బిగ్‌బాస్‌ వీక్షకుల్లో బలంగా ఉండడానికి ఆమె ఆటిట్యూడే కారణం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS