హీరోయిజం నుంచి విలన్‌గా టర్న్ అవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. `నాకు విలన్ పాత్రలు చేయాలని వుంది` అని పైకి చెబుతున్నా - ఆ సాహసం ఎవ్వరూ చేయరు. కానీ.. వరుణ్ తేజ్ ఆ ప్రయోగం, ప్రయత్నం చేశాడు. `వాల్మీకి`తో. తమిళంలో ఘన విజయం సాధించిన జిగడ్తాండకి ఇది రీమేక్. అక్కడ బాబీ సింహా చేసిన పాత్రని ఇక్కడ వరుణ్ పోషించాడు. వాల్మీకిలో వరుణ్ గెటప్ ఎలా ఉండబోతోందన్నది ముందే తెలిసిపోయింది. కానీ తన నట విశ్వరూపాన్ని మాత్రం టీజర్‌లోనే చూశారు. వాల్మీకి టీజర్‌కి మంచి స్పందన వస్తోంది.
అందరూ విలన్ పాత్రలో వరుణ్ తేజ్ విశ్వరూపం గురించే మాట్లాడుకుంటున్నారు. మంచి హైటు, దానికి తగ్గ గొంతు... ఈ పాత్రకు ఇచ్చిన మేకొవర్ అంతా బాగా కుదిరిపోయాయి. హీరోల్లో విలన్ వేషం వేయగల సమర్థుడు కోసం మన దర్శకులు తరచూ అన్వేషిస్తుంటారు. అలాంటి వాళ్లకు వరుణ్ ఓ ప్రత్యేమ్నాయం. ఇలానే రానా కూడా `బాహుబలి`లో భళ్లాలదేవగా తన విలనిజం చూపించగలిగాడు. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని పేరూ, క్రేజూ.. బాహుబలితో రానా సొంతమైంది. మరి.. వరుణ్ తేజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.