పునర్నవి 'పులిహోర': ఇదే 'బిగ్‌' టాపిక్‌.

By Ramesh - August 12, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో లవ్‌ స్టోరీస్‌ కామనే. కొన్ని జంటల మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపించి, వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతారు. తొలి సీజన్‌లో ప్రిన్స్‌ - దీక్షా పంత్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ని అలాగే నడిపించారు. ఇంకేముంది ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారట అనే ప్రచారం జరిగింది. ఏమైందన్నది తర్వాత సంగతి. ఇక రెండో సీజన్‌ విషయానికి వచ్చేసరికి సామ్రాట్‌ - తేజస్వి మదివాడ పెయిర్‌ని లవ్‌ బర్డ్స్‌గా ట్రీట్‌ చేశారు. ఈ పేరుతో వీరిద్దరూ చేసిన లవ్‌ హంగామా అంతా ఇంతా కాదు. ఈ సీజన్‌కి రియల్‌ కపుల్‌ వరుణ్‌ సందేశ్‌ - వితికా షెరూ ఎలాగూ ఉన్నారు.

 

వీరిద్దరి కెమిస్ట్రీని హైలైట్‌ చేస్తూనే మరోపక్క ఫ్రెష్‌ పెయిర్‌గా పునర్నవి భూపాళం - రాహుల్‌ సిప్లిగంజ్‌ని సిద్ధం చేసి పెట్టేశారు. వీరిద్దరి మధ్యా ఏదో జరుగుతోందనే ఫీల్‌ క్రియేట్‌ చేశారు. పునర్నవి కోసం ఏకంగా శ్రీముఖితో ఫ్రెండ్‌షిప్‌నే వదిలేశాడు రాహుల్‌. ఈ జంట మధ్య జరుగుతున్న చిలిపితనాల్ని హైలైట్‌ చేసి చూపిస్తూ, షోకి మరింత హైప్‌ తీసుకొస్తున్నారు బిగ్‌బాస్‌ టీమ్‌. ఇక తాజా వీకెండ్‌లో గెస్ట్‌గా వచ్చిన వెన్నెల కిషోర్‌ నోటి నుండి కూడా వీరిద్దరి గురించి స్పెషల్‌ ముచ్చట్లను రప్పించారు.

 

పునర్నవి కోసం రాహుల్‌ మ్యాచింగ్‌ బట్టలు వేసుకోవడం వంటివి గుర్తు చేస్తూ, పులిహోర కలిపేస్తున్నావ్‌.. అంటూ రాహుల్‌ని వెన్నెల కిషోర్‌ ఆట పట్టించాడు. అంతేకాదు, ఫన్నీ గేమ్‌లో భాగంగా ఓ పాటకు పునర్నవి, మహేష్‌ డాన్స్‌ చేస్తుంటే, అక్కడ ఎవరికో మాడుతోన్న స్మెల్‌ వస్తోంది.. అంటూ రాహుల్‌పై కెమెరా జూమ్‌ చేసి చూపించి ఫన్‌ క్రియేట్‌ చేయడంతో పాటు, రాహుల్‌ - పునర్నవి లవ్‌ ట్రాక్‌ని మరింత బలం చేసే ప్రయత్నం చేసింది బిగ్‌బాస్‌ టీమ్‌. బాగానే ఉంది కానీ, ఈ సారి ఈ 'బిగ్‌లవ్‌' ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS