డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన గురువు అయిన ఆర్జీవీ బాటలో నడుస్తున్నాడా అంటే? అవును అనే ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి షార్ట్ ఫిలిం పోస్టర్ చూస్తేనే అర్ధమవుతుంది.
‘హాగ్’ (కౌగిలింత) అనే పేరు ఈ షార్ట్ ఫిలిం కి పెట్టగా, ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి న్యూడ్ గా ఒక చెట్టుని కౌగిలించుకున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ షార్ట్ ఫిలింకి ఫీచర్ ఫిలిం కి పనిచేసే టీంనే తీసుకున్నాడు. సందీప్ చౌతా సంగీతం, ఎడిటింగ్ కోసం జునైద్, అలాగే ఈ చిత్రాన్ని చార్మీతో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ పైన ఈ షార్ట్ ఫిలిం నిర్మిస్తున్నారు.
ఇక ఈ షార్ట్ ఫిలిం డిసెంబర్ 31న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీనితో ఈ షార్ట్ ఫిలిం పోస్టర్ & టైటిల్ చూసి పూరి తన గురువైన ఆర్జీవీలా మారుతున్నాడా అని ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.
ఇప్పటికే ఆర్జీవీ- గన్స్ & థైస్, కడప వంటి హింసా-శృంగారం పాళ్ళు ఎక్కువగా పెట్టి వెబ్ సిరీస్ లు చేశాడు. ఈ తీరు చూస్తుంటే- ఈ గురు శిష్యులు అంతర్జాలంలో స్వైరవిహారం చేయనున్నట్టు అర్ధమవుతున్నది.