నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో `పైసా వసూల్ ` తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు దగ్గర ఆ సినిమా పెద్దగా అలజడి సృష్టించలేకపోయింది. అయినా సరే.. బాలయ్య పూరిని మళ్లీ నమ్మాడు. మరో అవకాశం ఇచ్చాడు. బాలయ్య - పూరి కాంబినేషన్‌లో మరో సినిమా సెట్ అయ్యింది. ఈ విషయాన్ని ఇటీవల బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. ఈసారి కూడా బాలయ్య కోసం పూరి.. పక్కా పైసా వసూల్ కథనే రాసుకున్నాడట. ఓరకంగా చెప్పాలంటే `పైసా వసూల్`లోని బాలయ్య క్యారెక్టరైజేషన్‌ని కంటిన్యూ చేస్తూ ఈ కథ సాగుతుందని సమాచారం. దానికి `తేడా సింగ్` అనే పేరు కూడా అనుకుంటున్నాడట
`పైసా వసూల్`లో బాలయ్య పేరు అదే. ఓ సందర్భంలో ఈ చిత్రానికి `తేడా సింగ్ `అనే పేరు కూడా పెట్టాలనుకున్నారు. కానీ చివరిక్షణాల్లో `పైసా వసూల్`గానే వచ్చింది. ఈసారి మాత్రం `తేడా సింగ్` అనే టైటిల్ తోనే ఈ సినిమా రూపుదిద్దుకోబోతోందని టాక్. పూరి ప్రస్తుతం `లైగర్`తో బిజీగా ఉన్నాడు. బాలయ్య చేతిలోనూ సినిమాలున్నాయి. ఈకాంబో సెట్ అవ్వడానికి మరో యేడాదైనా సమయం పట్టే అవకాశం ఉంది.