పూరి జగన్నాథ్ దర్శతక్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా `లైగర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా కూడా మొదలెట్టేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు.. అంటే మంగళవారం వెలువరించనున్నారు. ముంబైలో.. లైగర్ షూటింగ్ జరుగుతోంది. అక్కడే ఓ ప్రెస్ మీట్ పెట్టి, పూరి - విజయ్‌ల కొత్త సినిమాని ప్రకటిస్తారు.
వీరిద్దరి కాంబోలో `జనగనమణ` వస్తుందని వార్తలొచ్చాయి. మహేష్ కోసం పూరి రాసుకున్న కథ ఇది. అది విజయ్‌తో తీస్తాడని చెప్పుకొన్నారు. అయితే.. పూరి ప్లాన్ మారినట్టు తెలుస్తోంది. విజయ్ కోసం పూరి ఓ కొత్త కథ రాశాడట. ఇది పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తాడట. ఈ చిత్రానికి కరణ్ జోహార్ కూడా ఒకానొక నిర్మాత అని తెలుస్తోంది. లైగర్‌లో కూడా కరణ్ జోహార్‌కి వాటా ఉన్న సంగతి తెలిసిందే.