పూరి జగన్నాథ్-ఛార్మి విషయంలోనూ రూమర్స్ ఎప్పటినుండో వున్నాయి. అయితే, ఎప్పుడూ వారిద్దరూ దీనిపై స్పందించలేదు. తాజాగా పూరి తనదైన శైలిలో స్పందించారు. పూరి మ్యూజింగ్స్ తరహలో చాలా డీప్ ఒక వివరణ ఇచ్చారు. పెళ్లి అయిపోయిన వాడికి కోరికలు చచ్చిపోతాయని, వాంఛలు తగ్గిపోతాయన్నట్లు చెప్పారు. అయితే ఇందులో ఛార్మీ అని పేరు రాకుండా ఆమె అని వాడరారు.
ఇంతకీ పూరి ఏమన్నారంటే... ‘‘ఆమె 50ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆమె యంగ్ ఏజ్‌లో ఉంది కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నారు. అందరికీ ఓ రొమాంటిక్ యాంగిల్ ఉంటుందని నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది.
మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ వాంఛలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. కేవలం స్నేహం మాత్రమే కలకాలం ఉంటుంది. ఆమె 13ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. ఆమె సినిమా కోసం ఎలా కష్టపడి పనిచేస్తుందో తెలుసు’’ అంటూ తనదైనశైలిలో చెప్పుకొచ్చారు పూరి.