డ్రగ్స్ రాకెట్ లో నోటిసులు అందుకున్న వారిలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒకరు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన పాత్రికేయులతో ఈ డ్రగ్స్ విషయమై మాట్లాడినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మాటలతో కూడిన లెటర్ లో ఆయన జర్నలిస్టులని ప్రశ్నిస్తూ- 15 మందికి నోటిసులు అందాయి అంటూ 8 నుండి 10 పేర్లే ఎందుకు బయటపెడుతున్నారు. మిగిలిన వారి పేర్లు ఎందుకు బయటపెట్టట్లెదు అని అడగగా.. వారు మీరు సమాచారం ఇస్తే తప్పక వేస్తాము అని సమాధానమిచ్చారట.
దీనికి పూరి స్పందిస్తూ- ఆ ముగ్గురిలో ఒకరు ప్రముఖ నిర్మాత పెద్ద కుమారుడు అని మరొకరు లెజెండరీ ప్రొడ్యూసర్ మనవడు అని. ఇక మూడవ వ్యక్తి ఒక సీనియర్ హీరో రెండవ కుమారుడు అని చెప్పాడట. ఈ వివరాలు వినేసరికి అందరు షాక్ అయినట్టు ఆ లెటర్ సారాంశం.
ఇక తాను ఒక్కప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్టు, ఆర్ధికంగా ఒడిదుడుకులతో ఉన్నప్పుడు ఈ అలవాటు అయిందని, తరువాత తాను అందులోనుండి బయటపడినట్టు చెప్పాడట!
అయితే ఈ విషయాలతో కూడిన న్యూస్ పూరి జగన్నాధ్ ట్విట్టర్ కాని ఫేస్బుక్ నుండి కాని రాకపోయేసరికి ఇది పూరి అధికారిక ప్రకటన కాదు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.