పూరికి స‌ల్మాన్‌ఖాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌.

By Gowthami - October 24, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

పూరి జ‌గ‌న్నాథ్ స్టామినా గురించి కొత్త‌గా చెప్పేదేముంది? బ‌ద్రి సినిమాతోనే అది అర్థ‌మైంది. పోకిరి బంప‌ర్ హిట్‌తో పూరి అంటే ఏమిటో.. బాలీవుడ్‌కి సైతం తెలిసింది. పోకిరిని బాలీవుడ్‌లో రీమేక్ చేసి ఓ సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు స‌ల్మాన్ ఖాన్‌. అప్ప‌టి నుంచీ పూరీకీ, స‌ల్మాన్‌కీ మంచి రాపో ఉంది. ఇప్పుడు ఆ అనుబంధం మ‌రింత బ‌లంగా మార‌బోతోంది. పూరితో ప‌నిచేయ‌డానికి సల్మాన్‌ఖాన్ 'సై' అంటున్నాడు.

 

త‌న కొత్త సినిమా 'ద‌బాంగ్ 3' ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా పూరితో సినిమా గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే తాను హైద‌రాబాద్ వ‌స్తున్నానని, పూరిని క‌ల‌వ‌బోతున్నాన‌ని చెప్పుకొచ్చాడు స‌ల్మాన్‌. ఈ క‌ల‌యిక సినిమా కోస‌మ‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో పూరి ఓ బంప‌ర్ హిట్టు కొట్టాడు.

 

ఈసినిమా హిందీలోనూ రీమేక్ కానుంది. అన్నీ కుదిరితే.. పూరి - స‌ల్మాన్‌తో ఓ సినిమా చేయొచ్చు. అదంతా పూరి చెప్పే క‌థ‌ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రి.. ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ని పూరి జ‌గ‌న్నాథ్ ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగ‌ప‌ర‌చుకుంటాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS