దర్శకురాలిగా మారిన హాట్‌ బ్యూటీ!

By Inkmantra - October 24, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

వివాదాలు ఎక్కడుంటే, అక్కడ హీరోయిన్‌ రాధికా ఆప్టే దర్శనమిస్తుంది.. అనేంతలా రాధికా పేరు సంచలనమైంది. అఫ్‌కోర్స్‌ అన్ని వివాదాల్లోనూ రాధికా ఆప్టే తల దూర్చదులెండి. తనకు సంబంధించిన ఇష్యూసే అదేంటో, అలా వివాదాస్పదమవుతుంటాయి. ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం రాధికా ఆప్టే ఏం చేస్తోంది? ఓ సినిమా కోసం ఏకంగా దర్శకురాలిగా మారింది. ఇంతకీ ఏంటా సినిమా అంటే, 'స్లీప్‌ వాకర్స్‌' అనే మూవీ.

 

అయితే ఇది బిగ్‌ ఫిలిం కాదు, ఓ షార్ట్‌ ఫిలిం. సోషల్‌ అవేర్‌నెస్‌ కోసం రాధికా ఆప్టే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని రూపొందించింది. గ్లోబర్‌ వార్మింగ్‌ కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులు ఏ రకంగా ఉంటున్నాయి.. తర్వాతి తరాలపై ఆ వాతావరణ మార్పులు ఎలాంటి పరిణామాలు తీసుకురానున్నాయి అనే కాన్సెప్ట్‌పై రాధికా ఆప్టే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని రూపొందించింది. హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో నటించిన రాధికా ఆప్టే ఇంటర్నేషనల్‌ మూవీస్‌ పైనా దృష్టి సారించింది. కొన్ని హాలీవుడ్‌ మూవీస్‌లోనూ నటించిన అనుభవం రాధికా ఆప్టేకి ఉంది.

 

అలాగే తెలుగులో ఈ అమ్మడు చేసిన రెండు సినిమాలూ బాలయ్యతోనే నటించింది. నిజానికి వర్మ కంపెనీ నుండి దిగుమతి అయిన భామ రాధికా ఆప్టే. వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో రాధికా ఆప్టే తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాతే బాలయ్య సినిమాల్లో కనిపించింది. చేసినవి మూడు సినిమాలే అయినా, తెలుగు ప్రేక్షకులకు ఆ రేంజ్‌లో సుపరిచితురాలు కావడానికి కారణం ఆమెపై ఎప్పటికప్పుడు వినిపించే వివాదాల వార్తలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS