'ఫైటర్‌'ని పూరీ మామూలుగా టేకప్‌ చేయడంలేదండోయ్‌!

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌' హిట్‌తో పూరీ ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నాడు. ఆయనతో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ బాగా పెరిగిపోయాయి. ఇదివరకటి స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తాను తెరకెక్కించబోయే 'ఫైటర్‌' సినిమాని ఆ లెవల్‌లో రూపొందించే ఆలోచనలే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందించబోతున్నాడు పూరీ అనే టాక్‌ బాగా జనంలోకి వెళ్లిపోయింది. రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో 'ఫైటర్‌' రూపొందుతోంది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని పరిచయం చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాక, ఈ సినిమాకి బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ చేయి కూడా పడడంతో, పూరీ అనుకున్నది సాధిస్తాడనే గురి కుదరింది.

 

ఇక టైటిల్‌లో పవర్‌ ఉన్న ఈ సినిమాకి విలన్‌ పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలిన యోచిస్తున్నాడు పూరీ. అందుకే బాలీవుడ్‌ బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ని ఈ సినిమాలో విలన్‌గా తీసుకునే ఆలోచనలు చేస్తున్నాడట. విలన్‌గా మైక్‌ టైసన్‌ నటిస్తే, 'ఫైటర్‌'కి పూరీ అనుకున్న రేంజ్‌ రావడం ఖాయం. మొత్తానికి పూరీ - రౌడీ కలిసి 'ఫైటర్‌'ని ఏ రేంజ్‌లో చూపించబోతున్నారో చూడాలంటే, ఇంకొంచెం టైమ్‌ వెయిట్‌ చేయాలేమో. ప్రస్తుతం మన రౌడీ విజయ్‌ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 14న ఈ సినిమాని రిలీజ్‌ చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS