సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన పెళ్లి ఫోటోలు చూసి, 'మిర్చి' భామ రీచా గంగోపాధ్యాయకు పెళ్లయిపోయిందంటూ, ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఇంత సీక్రెట్‌గా సడెన్‌గా వివాహం చేసుకుందే ఈ ముద్దుగుమ్మ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. విషెస్ చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ, కామెంట్ చేసిన వారికి సమాధానమిచ్చింది అందాల రిచా. తమది రహస్య వివాహమేమీ కాదనీ, అమెరికాలో ఎంబీఏ చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్‌తో తనకు స్నేహం కుదిరిందనీ, ఆ స్నేహం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలవరకూ చేరిందనీ, మూడు నెలల క్రితం వివాహం జరిగిందనీ రీచా చెప్పుకొచ్చింది.
తన భర్త, అత్త మామలు చాలా మంచి వారనీ, అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళ్లడం తన అదృష్టమనీ రిచా చెప్పింది. సినిమాలకు బ్రేకప్ చెప్పి ఇంత కాలమైనా, తనపై అంతటి అపారమైన అభిమానం పెంచుకున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అయితే, ఫ్యూచర్‌లో సినిమాల్లో నటించే ఆలోచనల గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు రిచా గంగోపాధ్యాయ. బహుశా ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే మూడ్‌లో మాత్రమే ఉంది కాబోలు.