గత కొన్ని నెలలుగా సినిమా థియేటర్లు మూత పడటంతో ప్రేక్షకులందరూ ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలపై, ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఓటీటీ వేదికల కోసం ఒరిజినల్ కంటెంట్ తయారు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు ఆ పనుల్లో ఉన్నారు. ఈ బాటలో పూరి జగన్నాధ్ కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాధ్ ప్రస్తుతం అం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సమయంలో ఆయన కొత్త స్క్రిప్టులపై పని చేస్తున్నారని, తన రైటింగ్ టీంతో కలిసి ఓటిటి వేదికల కోసం వెబ్ సిరీస్ స్క్రిప్టులు కూడా తయారు చేశారని సమాచారం. పూరి కనెక్ట్ బ్యానర్ పై కొన్ని వెబ్ సిరీస్ లను, వెబ్ ఫిలిం లను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ వారితో ఒకటి రెండు ఒప్పందాలు కూడా చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ వెబ్ సిరీస్ లకు పూరి శిష్యులు దర్శకత్వం వహిస్తారని సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ లు పట్టాలు ఎక్కుతాయని అంటున్నారు. మరి పూరి స్కూల్ నుంచి వచ్చిన నూతన దర్శకులు ఈ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో వేచి చూడాలి.