పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ మూవీ 'లైగర్' ఆగస్ట్ 25 న రిలీజ్ అయ్యి ఫస్ట్ షో నుంచే చాలా దారుణమైన ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. సినిమా వసూళ్ళు దారుణంగా వున్నాయి. తెలంగాణ, ఏపీ కూడా లైగర్ ని కాపాడలేకపోయాయి. మొత్తంగా లైగర్ సినిమా యూనిట్‌కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగేలా చేసింది లైగర్ టీమ్. ఎన్నో అంచనాలతో సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది.
రిలీజ్ కు ముందే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్‌లో అంతకుమించి వసూళ్లు సాధిస్తామని టీం నమ్మకం పెట్టుకుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. తీవ్ర నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలు పూడ్చడానికి దర్శకుడు పూరి ముందుకు వచ్చాడు.
గచ్చిబౌలిలోని తన సొంత ఆస్తిని లైగర్ కోసం అమ్మేశారని తెలిసింది. దీని విలువ దాదాపు 30 కోట్లని తెలిసింది. లైగర్ బడ్జెట్ అనుకున్న దానికి కంటే డబుల్ అయ్యింది. లాక్ డౌన్ లో వడ్డీలు పెరిగాయి. సినిమా దారుణంగా దెబ్బకొట్టింది. దీంతో మరో ఆప్షన్ కనిపించకపోవడంతో పూరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.