ఎట్టకేలకు పుష్ప 2 సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతారు. 2023లో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్. ఇప్పుడు పుష్ప 2 బడ్జెట్, పారితోషికాల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్. అదే నిజమైతే... ఆర్.ఆర్.ఆర్ తరవాత అంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమా కోసం సుకుమార్ ఏకంగా రూ.50 కోట్లు, అల్లు అర్జున్ కి ఏకంగా రూ.100 కోట్లు ఇస్తున్నార్ట. అంటే.. వీరిద్దరి పారితోషికాలతోనే సగం బడ్జెట్ అయిపోతోంది.
పుష్ప 1.. దాదాపు రూ.400 కోట్ల మార్కెట్ చేసుకుంది. పుష్ప 2 విడుదలై, హిట్టయితే.. దాదాపుగా రూ.600 కోట్ల వరకూ వస్తుందని ఓ అంచనా. అందుకే.. 350 కోట్లు ఖర్చు పెట్టడానికి ధైర్యం చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లే ముందే నాన్ థియేటరికల్ రైట్స్ అన్నీక్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఆ రూపంలో కనీసం 175 కోట్లు రాబట్టాలని ఆలోచన. దాంతోనే సినిమా మొదలెట్టేస్తారు. పైగా అన్ని ఏరియాల నుంచి భారీగా అడ్వాన్సులు రాబట్టుకుంటున్నాని టాక్ నడుస్తోంది. అంటే.. ఈసినిమా బడ్జెట్ ని సినిమానే సంపాదించుకుంటుందన్నమాట.
పుష్ప సూపర్ హిట్టవ్వడం, పుష్ప 2పై విపరీతమైన క్రేజ్‌పెరిగిపోవడం వల్ల... ఈసినిమాపై ఇంత ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ఏమాత్రం సంకోచించడం లేదు.