`లైగర్`తో మరోసారి బాలీవుడ్ లో కి అడుగు పెడుతున్నాడు పూరి జగన్నాథ్. ఆ తరవాత తెరకెక్కించే `జనగణమన` కూడా పాన్ ఇండియా సబ్జెక్టే. ఇక మీదట పూరి తన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించాలని ఫిక్సయ్యాడు. బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. సల్మాన్ ఖాన్‌తో పూరి ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే.. పూరి దృష్టి ఇప్పుడు యూత్ హీరోలపై పడింది. రణబీర్ కపూర్, రణవీర్ సింగ్‌లంటే పూరికి చాలా ఇష్టం. వీళ్లతో సినిమాలు చేయాలని పూరి భావిస్తున్నాడు. ఈ విషయాన్ని పూరినే చెప్పాడు.
``ఖాన్ త్రయంలోని హీరోలందరితోనూ పనిచేయాలని ఉంది. అయితే.. ఈతరం కుర్రాళ్లూ బాగా చేస్తున్నారు. ముఖ్యంగా రణవీర్, రణబీర్ లాంటి యంగ్ టాలెంట్ బాలీవుడ్ కి అందుబాటులో ఉంది. వాళ్లతో అద్భుతాలు సృష్టించొచ్చు. త్వరలోనే వీళ్లతో సినిమాలు చేస్తా`` అని పూర్తి ప్రకటించేశాడు. నార్త్ హీరోలు కూడా దక్షిణాది దర్శకులతో పనిచేయాలని తహతహలాడుతున్నారు. వాళ్లకు పూరి లాంటి దర్శకుడు దొరికితే వదలరు. లైగర్ గనుక హిట్టయితే.. బాలీవుడ్ హీరోల దృష్టి పూరిపై గట్టిగా పడుతోంది. అప్పట్లో వర్మ లా.. ఇప్పుడు పూరి జగన్నాథ్.. కొన్నాళ్లు బాలీవుడ్ లో సెటిలైపోయే ఛాన్సుంది.