శ్రీవల్లి మళ్ళీ మాయ చేసింది

మరిన్ని వార్తలు

ఈ సారి ఆగస్టు 15 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పుష్ప రాజ్ రానున్నాడు . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటించిన  పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కానుంది. మొదటి పార్ట్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే, సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది. మొదటి పార్ట్ లో అన్ని పాటలు దేశ విదేశాల్లో చాలా పాపులర్ అయ్యాయి. దీనితో రెండో భాగం పాటలు పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పుష్ప టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు కపుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మొదటి పార్ట్ లో శ్రీవల్లి నా సామి అంటూ పాడితే, రెండో పార్ట్ లో పసిపిల్లవాడు, మహారాజు అని భర్తని కీర్తించింది.     


"సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ" అనే పాటని మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచగా, శ్రేయా గోషల్ ఆలపించిన ఈ పాటకి చంద్ర బోస్ సాహిత్యం అందించారు. ఐదు భాషల్లోనూ శ్రేయా గోషల్ పాడటం విశేషం. చంద్ర బోస్  సాహిత్యానికి సొబగులు అద్దినట్టు ఉంది శ్రేయా వాయిస్. రెండు రోజుల క్రితం ఈ సాంగ్ ప్రోమోతోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయిన పాటకి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ పాటలో బన్నీ, రష్మిక హుక్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కపుల్ సాంగ్ అంటూ బిహైండ్ ది సీన్స్ తరహాలో లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. 

బన్నీ, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ త్రయం కలిస్తే మ్యూజికల్ హిట్ గ్యారంటీ అన్న మాటను పుష్ప 2 సాంగ్స్ తో మరొక సారి రుజువు చేశారు అనిపిస్తోంది. ఈ మూవీలో మొత్తం 5 పాటలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి రెండు పాటలు రిలీజ్ అయ్యి యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఇంకో మూడు పాటలు రావాల్సి ఉంది. ఇందులో ఒకటి ఐటెం సాంగ్. వీరి కాంబో వచ్చిన ఐటెం సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీలో వచ్చే ప్రత్యేక గీతం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS