తెలుగు సినిమా మార్కెట్ దిన దినాభివృద్ధి చెందుతోంది. బాహుబలి లాంటి సినిమాల వల్ల... బడ్జెట్ ఎంత పెట్టినా, తిరిగా రాబట్టుకోవొచ్చన్న ధైర్యం ఏర్పడింది. ఇది వరకు 100 కోట్ల బడ్జెట్ అంటే `వామ్మో` అనేవారు. ఇప్పుడు 200 కోట్లు దాటేసినా `ఫర్వాలేదులే..` అనుకుంటున్నారు. `పుష్ష` నే తీసుకోండి. ఈ సినిమా బడ్జెట్ ప్రస్తుతానికి 250 కోట్లు. సినిమా పూర్తయ్యేనాటికి 300 కోట్లయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బన్నీ సినిమాకి 300 కోట్ల బడ్జెట్ అంటే ఎక్కువే. కానీ సుకుమార్ ఆలోచన వేరు. ఈ సినిమాని 2 భాగాలుగా విడుదల చేద్దామనుకుంటున్నాడు.
రెండు భాగాలు, రెండు శాటిలైట్‌లు, రెండు ఓటీటీ రేట్లు... ఇలా అన్ని రూపాల్లోనూ డబుల్ డబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఒక్కో భాగాన్నీ 150 కోట్లకు అమ్ముకున్నా.. రెండు భాగాలకూ కలిపి 300 కోట్లు రాబట్టడం ఈజీనే. అంటే.. దాదాపు 50 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. కాకపోతే.. ఈసినిమా బడ్జెట్ ని ఇంకాస్త కుదించాలని, మైత్రీ మూవీస్ భావిస్తోంది. ఎందుకంటే తొలి భాగం అటూ ఇటూ అయితే. రెండో భాగాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రారు. అప్పుడు అసలుకే ఎసర వస్తుంది. ఇందుకు సంబంధించి సుకుమార్ తో నిర్మాతలు పలుదఫాలుగా చర్చలు జరిపి, ఎక్కడెక్కడ బడ్జెట్ ఆదా చేయాలో ఆలోచిస్తున్నార్ట. మరి సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుని, నిర్మాతల్ని గట్టెక్కిస్తాడవో చూడాలి.