పుష్ప జోరు బాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈసినిమా రూ.90 కోట్లు దాటి వంద కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతానికి రూ.92 కోట్లు పుష్ప ఖాతాలో పడ్డాయి. పైనల్ రన్ లో రూ.100 కోట్లు దాటేయడం చాలా ఈజీ. ఇదంతా థియేటరికల్ నుంచి వచ్చిన సొమ్ము. నాన్ థియేటరిల్ రూపంలో కనీసం 30 నుంచి 40 కోట్లు రాబట్టొచ్చని ఓ అంచనా. ఆ లెక్క ప్రకారం ఒక్క బాలీవుడ్ నుంచే ఏకంగా రూ.140 కోట్లు తెచ్చుకున్నట్టు. పుష్షకి డివైడ్ టాక్ వచ్చింది. పైగా.. హిందీలో ఈ సినిమాకి పబ్లిసిటీ ఏమాత్రం చేయలేదు. దానికి తోడు... కరోనా ఎఫెక్ట్ ఉంది. జనాలు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. నైట్ కర్‌ఫ్యూలు మొదలయ్యాయి. ఇన్ని మైనస్ ల మధ్యకూడా పుష్స 100 కోట్లు తెచ్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
బాలీవుడ్ లో పుష్ప ఈ స్థాయిలో వసూళ్లు తెచ్చుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రన్ దాదాపుగా చివరికి వచ్చేసింది. కానీ.. బాలీవుడ్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. వీకెండ్స్ లో థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. అందుకే... ఓటీటీలో ఈ సినిమా వచ్చినా, హిందీ వెర్షన్ ని మాత్రం ఉంచలేదు. ఓ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాని చూసినట్టే.. పుష్పని అక్కడి ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం.. పుష్ప టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది.