అల్లు అర్జున్‌కు రికార్డులు కొత్త కాదు. బన్నీ సినిమాలకు సంబంధించిన టీజర్లూ, ట్రైలర్లూ, పాటలూ.. రికార్డుల మోత మోగిస్తుంటాయి. పుష్ఫ కూడా అదే చేసింది. అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. అల్లూ అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లోనే టీజర్ విపరీతంగా నచ్చేసింది. తన లుక్, మేనరిజం, తగ్గేది లే అనే డైలాగూ... ఫ్యాన్స్‌కి బాగా నచ్చేసింది. ఆ విజువల్స్, దేవిశ్రీ ఇచ్చిన ఆర్.ఆర్ టీజర్ ని అమాంతం ఎత్తేశాయి. అందుకే.. యూ ట్యూబ్ లో ఈ టీజర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృస్టిస్తూనే ఉంది.
తాజాగా ఈ టీజర్ ఈ టీజర్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకుంది. 1.2 మిలియన్ లైక్స్‌ను దక్కించుకుంది. ఈ మైలురాయిని అతి తక్కువ సమయంలో చేరుకున్న తెలుగు టీజర్‌గా ‘పుష్ప’ రికార్డుకెక్కింది. `ఆర్.ఆర్.ఆర్`లో భాగంగా వచ్చిన భీమ్ వీడియో 50 మిలియన్ల వ్యూస్‌ను చేరుకునేందుకు 6 నెలలు పడితే, బన్నీ పుష్ప టీజర్‌కు కేవలం 20 రోజులు మాత్రమే పట్టడం విశేషం.