పుష్పలో `చూపే బంగారమాయెనె.. శ్రీవల్లీ` పాట సూపర్ డూపర్ హిట్టు. విడుదలకు ముందు, విడుదల తరవాత కూడా ఈ పాట మార్మోగిపోయింది. ఇప్పటికీ రీల్స్‌రూపంలో ఈ సినిమాలోని బన్నీ సిగ్నేచర్ స్టెప్పుని ఇమిటేట్ చేస్తూ.. వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ పాట ఖండాంతరాలకూ చేరింది. ముఖ్యంగా క్రికెటర్లు ఈ పాటకు స్టెప్పులేయడం చూస్తూనే ఉన్నాం. డేవిడ్ వార్నర్ దగ్గర్నుంచి బ్రావో వరకూ... ఈ పాటని అనుకరిస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో సైతం.. అక్కడి క్రికెటర్లు... తగ్గేదే లే.. మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ వీడియోలన్నీ బాగా వైరల్ అయిపోయాయి. ఈ పాట.. ఈ సినిమా ఖండాంతరాలకు చేరందన్న సిగ్నల్స్ పంపింది.
అయితే ఈ పాట వెనుక, ఈ వీడియోల వెనుక చాలా వ్యాపారం జరిగిందన్న గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇలాంటి వీడియోలు రూపొందించడానికి ఒక్కో క్రికెటర్‌కీ భారీ మొత్తంలో డబ్బులు అందజేశార్ట. అందుకే ఈ పాటని వీళ్లంతా ప్రమోట్ చేస్తున్నారని టాక్. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఆ సంస్థ.. వ్యూవర్ షిప్ కోసం ఈ పని చేసిందని తెలుస్తోంది. త్వరలోనే పుష్ప 2 సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ సినిమా విడుదలకు, వ్యాపారానికి సైతం.. ఇలాంటి ప్రమోషన్లు బాగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో... పుష్ప నిర్మాతలు కూడా దీనిపై ఖర్చు చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజా నిజాలేంటో.. నిర్మాతలకూ, ఆ క్రికెటర్లకే తెలియాలి.