సుకుమార్ ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుంది. తన సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ నీ ప్రత్యేకమైన శ్రద్ధతో తీర్చిదిద్దుతాడు. హీరో, విలన్ల పాత్రలైతే మరీనూ. `పుష్ష`లో అల్లు అర్జున్ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. విలన్ పాత్ర ఇంకెలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమాలో.. ఫహద్ ఫాజిల్ విలన్ అనగానే ఆ పాత్రపై మరిన్ని అంచనాలు మొదలయ్యాయి.
ఈలోగా.. ఫాజల్ లుక్ కూడా బయటకు వచ్చింది. బన్వర్ సింగ్ షెకావత్ ఎపీఎస్.. పేరుతో ఆ పాత్రని సుకుమార్ పరిచయం చేశాడు. గుండు గెటప్ తో ఫహద్ ఫాజిల్ దర్శనమిచ్చాడు. అయితే ఈ గెటప్ ఏమాత్రం కొత్తగా లేదన్నది సినీ జనాల అభిప్రాయం. రామ్ జగన్, రమణ గోగులని చూస్తున్నట్టే అనిపిస్తోందని, ఫాజిల్ ని చూసినట్టు లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అంతేకాదు.. ఈ పాత్రపై మీమ్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికైతే.. అంత కిక్ ఇవ్వలేదు గానీ, సిల్వర్ స్క్రీన్ పై మాత్రం.. ఫాజిల్ షాకిచ్చేయడం గ్యారెంటీ. ఎందుకంటే తను జాతీయ ఉత్తమ నటుడు. ఇప్పుడు సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. తనని సుకుమార్ ఏ రేంజ్‌లో వాడుకుంటాడు. అదెలా ఉంటుందో తెలియాలంటే పుష్ష 1 వచ్చే వరకూ ఆగాలి.