మనోళ్ళు కొత్త కథలు తీయరా? మనకి కొత్త సినిమాలు చూసే యోగం లేదా ఇక? ఇలా బాధ పడి తెలుగు సినిమా ని తిట్టుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న అభిమానులు చాలా మంది. “జనాలు ఇవే చూస్తున్నారు, మేము ఇవే తీస్తున్నాం – మీరు ఇవే తీస్తున్నారు కాబట్టి అవే చూస్తున్నాం” – ఇదో ‘కోడి ముందా.. గుడ్డు ముందా?’ తరహ వ్యవహారం.
కానీ హిట్టో/ఫ్లాపో పక్కనపెట్టి మంచి కథ అయితే చెప్పాల్సిందే అని కంకణం కట్టుకున్న నిర్మాణ సంస్థల్లో ముందంజలో ఉన్న సంస్థ – పీవీపీ సినిమా!
గత సంవత్సరం నుండి ఇప్పటివరకు పీవిపీ ప్రొడక్షన్ హౌస్ నుండి రిలీజ్ అయిన ౩ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొత్త “ఊపిరి’ పోశాయనే చెప్పొచు!
2016 మొదట్లో వచ్చిన ‘క్షణం’ చిత్రం కొత్త దర్శకులకి అలాగే కొత్త కథలకు దారి చూపిన చిత్రంగా పేరొందింది. సరే స్టార్ తారాగణం కాదు, ఎదో హిట్ అయిందిలే అని కొట్టిపరేస్తున్నారా?
అయితే మార్చ్ 25న రిలీజ్ అయిన ‘ఊపిరి’ విజయం ని ఎలా అభివర్ణించాలి? నాగార్జున, కార్తి, తమన్నా లాంటి స్టార్లతో ద్విభాషా చిత్రం గా రూపొందిన ఊపిరి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ‘హీరో కన్నా కథనే గొప్ప’ అని మరోసారి నిరూపిoచింది! నాగార్జున ఇందులో చేసిన పాత్ర ట్రెండ్ సెట్టింగ్ అనే చెప్పొచు.
ఆ తరువాత వచ్చిన మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా కమర్షియల్ గా పీవిపీ బ్యానర్ కి ఒక చేదు జ్ఞాపకమనే చెప్పాలి. అయినా సరే కొత్త ఆలోచనలను ప్రోత్సహించే విషయంలో నిర్మాత పీవిపీ కాని పీవిపీ సినిమాస్ తన పంథా మార్చుకోలేదు అనడానికి సాక్ష్యం ఈ మధ్యనే రిలీజ్ అయిన ‘ఘాజీ’.
భారతదేశ తొలి సబ్ మెరైన్ చిత్రాన్ని నిర్మించడానికి పీవిపీ సంస్థ చూపిన తెగువ అభినందించక తప్పదు. అదే సమయంలో ఈ చిత్రాన్ని తెలుగులోనే గాక హిందీలోను నిర్మించి ఒక విధంగా తెలుగు చలనచిత్ర స్థాయిని పెంచారు. ఇలాంటి మంచి ప్రయోగాత్మక చిత్రాలకు పీవిపీ సంస్థ ఒక ప్రయోగశాల అవ్వాలని, ప్రయోగాలతో పాటు వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
తెలుగులో కొత్త తరహా చిత్రాలకు ‘ఊపిరి’ పోస్తున్నందుకు iQlik Movies తరుఫున ఇవే మా అభినందనలు!