ప్రముఖ నిర్మాత పీవీపీ తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) గారు ఇక లేరు.
అందుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం, రాఘవేంద్రరావు గారు అస్వస్థతతో నిన్నటి రోజున హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితం ఆయన చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తున్నది. ఈ సంఘటనతో పీవీపీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఈయన స్వస్థలమైన విజయవాడకి అంత్యక్రియల నిమిత్తం రాఘవేంద్ర రావుగారి పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు జరుగుతాయి.
ఈ సందర్భంగా మా www.iqlikmovies.com తరపున పీవీపీ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.