తెలుగులో వస్తున్న క్వీన్ చిత్రానికి సంబంధించిన వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఉన్నపళంగా దర్శకుడు నీలకంఠ సినిమా నుండి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే దీనికి సంబంధించి తనకి ఎటువంటి సంబంధం లేదు అని హీరోయిన్ తమన్నా ఇప్పటికే ప్రకటించినప్పటికీ, దర్శకుడు మధ్యలోనే వెళ్ళడానికి తమన్నా కూడా కొంతమేర కారణం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలే వీటన్నిటికీ కారణమట!
ఇక నీలకంఠ స్థానంలో, క్వీన్ కన్నడ వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్న రమేష్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం చేయనున్నారట. అయితే ఇప్పటికే నీలకంఠ తీసిన సన్నివేశాలు యధాతదంగా ఉంచాలి అని రీ-షూట్ అక్కర్లేదు అని యూనిట్ నిర్ణయం తీసుకుందట.
మొత్తానికి తెలుగు ‘క్వీన్’ సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారుతున్నది.