తెలుగులో ఎర్ర సినిమాలకి కేర్ అఫ్ అడ్రస్ గా ఉన్న మూర్తన్న అలియాస్ ఆర్ నారాయణమూర్తి నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అందరిలోనూ ఆయన పట్ల సానుభూతిని తెలియచేసేలా చేస్తున్నాయి. ఇంతకి ఆ వార్తలేంటి అంటే- తాను సరైన సమయంలో పెళ్ళి చేసుకుని తనకంటూ ఒక ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండేది అని ఇప్పుడు తనకి అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు.
తాను వయసులో ఉన్నప్పుడు ఈ రెండిటి పైన పెద్దగా ఆసక్తి చూపలేదు అనే అయితే ఇప్పుడు మాత్రం అలా చేసి ఉండకూడదు అని అనిపిస్తుంది అని తన మనసులోని బయటపెట్టాడు. అందుకే ఇప్పుడు ఉన్న యువతకి తాను చక్కగా పెళ్ళి చేసుకుని తమకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాడు.
ఇక ఆయన తాజా చిత్రం అన్నదాత సుఖీభవ గురించి మాట్లాడుతూ- దేశంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆ పరిస్థితులని అద్దంపట్టేలా ఈ చిత్రం ఉంటుంది అని ఇంటర్వ్యూ ముగించారు.