సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులనే డ్రగ్స్ రాకెట్ విషయంలో ప్రముఖంగా చూపిస్తున్నారు అంటూ ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
గత బుధవారం నుండి రోజుకోకరి చొప్పున టాలీవుడ్ ప్రముఖులని ఒక్కరోక్కరిగా SIT విచారిస్తుండగా, మీడియావారు డ్రగ్ రాకెట్ లో సినీ ఇండస్ట్రీ వారు మాత్రమే ఉన్నట్టు చూపెట్టడం శోచనీయం అని అభిప్రాయపడ్డారు.
ఇక డ్రగ్స్ అనేది అన్ని రంగాలకి బాగా పాకిపోయింది అని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అరికట్టడానికి మార్గాలు అన్వేషించాలే తప్ప ఒక్క సినీ ఇండస్ట్రీ లోని ప్రముఖులనే నేరగాల్లుగా చూపెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.