మలయాళ నటి మైథిలీ ప్రైవేటు ఫోటోలు లీక్ చేసాడు అని ఆరోపిస్తూ మలయాళ చిత్ర పరిశ్రమ చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే, మైథిలీకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన కిరణ్ మధ్య 2008లో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం క్రమంగా ఒక బంధానికి దారి తీసింది, ఆ సమయంలోనే కిరణ్ కి అంతకుముందే పెళ్ళి అయిందని తెలియడంతో మైథిలి.. కిరణ్ కి దూరం జరిగిపోయింది.
ఇక ఈ మధ్య కాలంలో కిరణ్.. నటి మైథిలీకి సంబందించిన ప్రైవేటు ఫొటోస్ ఉన్నాయంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అలా బెదిరించడమే గాక డబ్బు కూడా ఇవ్వమంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.
అలా చేస్తూ, మైథిలికి చెందిన కొన్ని ప్రైవేటు ఫోటోలని అంతర్జాలంలో లీక్ చేశాడు. ఈ విషయమై పోలీసులకి ఫిర్యాదు చేయగా,వారు వెంటనే కిరణ్ ని అదుపులోకి తీసుకొని ఈ నేరంలో పాల్గొన్న మరికొంతమంది గురించి విచారణ చేపట్టారు.