బికినీ బ్యూటీ రాయ్ లక్ష్మీ లేటెస్ట్గా బర్త్‌డే పార్టీని ఘనంగా జరుపుకుంది. ఏముంది ఇందులో వింత అనుకుంటున్నారా.? వింతగానే ఉందండీ బాబూ. బర్త్‌డే అంటే ఫ్రెండ్స్, కేక్ కటింగ్, డిన్నర్ అండ్ డ్రింకింగ్.. ఎక్స్ట్రా ఎక్స్ట్రా.. ఇవే కదా మీకు తెలిసిన పార్టీలు. అయితే, మన రాయ్ లక్ష్మీ బర్త్‌డే పార్టీ ఎలా చేసుకుందో చూశారా. సోషల్ మీడియాలో ఈ బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫోటోలు హాట్ హాట్‌గా హల్చల్ చేస్తున్నాయి. అసలింతకీ ఏముందంటారా.? బోల్డ్ అనాలా.? వైల్డ్ అనాలా.? అర్ధం కావడం లేదు. పిక్స్ చూస్తున్నారుగా.
పిక్స్‌లో రాయ్ లక్ష్మీతో పాటు ఉన్న ముద్దుగుమ్మ షామా సికిందర్. బాలీవుడ్లో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ఈ ఇద్దరూ కలిసే ఈ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూస్తున్నారుగా. అదీ సంగతి. బీచ్‌లో హాట్ హాట్ బికినీలు, హీటెక్కించే పోజుల్లో బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంది రాయ్ లక్ష్మీ. బాలీవుడ్లో 'జూలీ 2' సినిమాలో నటించింది రాయ్‌లక్ష్మీ. ఆ టైంలోనే ఆమెకు చాలా మంది బాలీవుడ్ భామలతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. 'దిక్కులు చూడకు రామయ్యా' ఫేం సనా మక్బూల్తోనూ రాయ్ లక్ష్మీకి మంచి స్నేహముంది. అయితే స్నేహం సంగతి అటుంచితే, ఈ బర్త్‌డే పాప పోజులేంటండీ బాబూ మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నాయ్.