చక్కనమ్మలు క్రిస్మస్ని ఇన్నోవేటివ్‌గా జరుపుకోవాలని తాపత్రయపడుతుంటారు. హాట్ భామలైతే, అందాల ఆరబోతలో ఇన్నోవేషన్ వెతుక్కుంటారు. తాజాగా హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ తన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి సాగర తీరాన్ని వేదికగా చేసుకుంది. సాగర తీరంలో ఇసుక తిన్నెల్లో సన్ సెట్ బ్యాక్ గ్రౌండ్లో జాయ్‌ఫుల్‌గా క్రిస్మస్ జరుపుకుంది చూశారా.? బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో టూ పీస్ బికినీ ధరించి భలే ఎంజాయ్ చేస్తోందిలెండి. యాక్సెసరీస్ విషయానికి వస్తే, క్రిస్మస్ క్యాప్ ధరించింది.
పెద్ద పెద్ద చెవి రింగులు ధరించింది. గుండ్రని గాగుల్స్‌తో రెట్టించిన ఉత్సాహంతో ఇసుక తిన్నెల్లో మోకాలిపై కూర్చొని రెండు చేతులూ పక్కకి చాచి గుప్పిళ్లతో ఇసుకను వదులుతూ ముఖంలో నవ్వులు చిందిస్తూ భలే పోజిచ్చిందిలే. బ్యాక్ గ్రౌండ్లో సన్ సెట్ అరుణ కాంతి, దూరంగా కనిపిస్తున్న సాగర తీరం రాయ్ లక్ష్మి అందాలతో కుమ్మక్కై, పిక్‌ని ఆహ్లాదంగా మార్చేశాయి. నిజంగానే సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది ఈ ఫోటో. ఇంకెందుకాలస్యం. ఇంత వైవిధ్య వర్ణనా భరితంగా ఉన్న ఈ చిత్రాన్ని కళ్లతో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయాల్సిందే.