మహిళలపై లైంగిక వేధింపులు అనేవి చాలా సర్వసాధారణంగా మారిపోయాయి ప్రస్తుతం సమాజంలో. దీనికి సవాలక్ష కారణాలు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి అమ్మాయిల ఇండిపెండెంట్ మైండ్, డ్రస్ సెన్స్, లైఫ్ స్టైల్ తదితర సున్నిత అంశాల్లో వచ్చిన బలమైన మార్పులే అని చెప్పక తప్పదు. అయితే ఈ లైంగిక వేధింపుల విషయంపై ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ తాజాగా స్పందించింది. అయితే రాయ్ లక్ష్మీ ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చిందో తెలీదు కానీ, ఆమె అన్నదేంటంటే లైంగివక వేధింపులు అనేవి మహిళలపై అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమే అన్నదట. నిజమే కదా. దీనిలో తప్పేముంది. అంటే సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ అన్న ఈ మాటలకు పలువురు రీ రెస్పాండ్ అయ్యి, రాయ్ లక్ష్మీపై విమర్శ:లు గుప్పించడం మొదలెట్టేశారట. అంటే రాయ్ లక్ష్మీ కూడా ఈ రకమైన వేధింపులకు గురియ్యింది కాబోలు అంటూ ఆమెతో చడుగుడు ఆడేస్తున్నారట. చాలా సర్వసాధారణంగా మహిళలని వెంటాడుతున్న సమస్య ఇది. నిజంగానే దీనికి ఏ రంగమూ అతీతం కాదు. అలాంటిది సినీ రంగం అంటే గ్లామర్ ప్రపంచం, రంగులమయం. అలాంటిది ఈ రంగంలో ఇంకా కామన్ ఈ సమస్య. సో రాయ్ లక్ష్మీ ఈ సమస్యను ఫేస్ చేసిందా లేదా అనే విషయం పక్కన పెడితే, స్పందించినందుకు ఆమెకు వచ్చిన చిక్కులు ఇవి. ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో మెగాస్టార్ చిరుతో ఐటెం సాంగ్‌లో చిందేసింది. బాలీవుడ్‌లో 'జూలీ 2' సినిమాలో నటిస్తోంది.