సోషల్ మీడియాలో అభిమానులకి ఎలా కిర్రాకు పుట్టించాలో బహుశా రాయ్ లక్ష్మీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. బికినీ ఆమెకి కొత్త కాదు.. బికినీలో ఆమె సొగసుల్ని ఆస్వాదించడం ఆమె అభిమానులకీ కొత్త కాదు. కానీ, ఎప్పటికప్పుడు రకరకాల బికినీల్లో, రకరకాల పోజుల్లో అందాలు ఒలకబోసే రాయ్ లక్ష్మీ, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ఖాతా నుంచి బయటకొచ్చిన మరో ఆణిముత్యం ఇది.
రెడ్ హాట్ రత్తాలు.. అని ఎన్నిసార్లు చెప్పుకున్నా అభిమానులకి తనివితీరదంతే.. అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. లోపల టూ పీస్ బికినీ.. దాన్ని కవర్ చేసేలా రెడ్ కలర్‌లోనే ఇంకో ఔట్‌ఫిట్.. వెరసి, 'నిధుల్ని' అలా దాచేసినాగానీ.. రాయ్ లక్ష్మీలో హాట్ అప్పీల్ కుర్ర గుండెలకి స్వీట్ 'హార్ట్ అటాక్' తెప్పించేస్తోంది. తమిళంలో మూడు సినిమాలు, బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోన్న రాయ్ లక్ష్మీ, త్వరలోనే ఓ ప్రెస్టీజియస్ తెలుగు మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేయబోతోందట.