ఈ మధ్య రాశీఖన్నా అందా ఆరబోతకు హద్దే లేకుండా పోతోంది. సినిమాల్లో ఓవర్ డోస్ గ్లామర్ పెంచడం సంగతెలా ఉన్నా, సినిమా ప్రమోషన్స్‌లో అమ్మడి గ్లామర్ హవా మరింత ఎక్కువైపోతోంది. మొన్నటికి మొన్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రమోషన్స్‌లోనూ రాశీఖన్నా హాట్ హాట్‌గా రెచ్చిపోయింది. తాజాగా ‘వరల్డ్ ఫేమస్ వర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిగిలిన ముగ్గురు హీరోయిన్స్‌తో పోల్చితే, రాశీఖన్నా హాట్ డోస్ ఓవర్లో ఉంది. రెడ్ హాట్ మోడ్రన్ వేర్లో డీప్ నెక్డ్ హాట్ క్లీవేజ్‌తో కనిపించి కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టేయాలనుకుంది. కెమెరా కన్ను కూడా తన మీదే ఎక్కువ పడాలనుకుందో ఏమో, ఇలాంటి కాస్ట్యూమ్‌లో దర్శనమిచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ ఈవెంట్లో రాశీఖన్నా చివరి వరకూ ఉండలేదు. మధ్యలోనే వెళ్లిపోయింది. ఈవెంట్ చివరిలో హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ ఇస్తున్న సమయంలో హీరోయిన్స్ గురించి ప్రస్థావిస్తూ, రాశీఖన్నా క్యారెక్టర్ గురించి చెబుతున్నప్పుడు.. ‘ఏదీ పిల్ల.. కనిపించడం లేదు..’ అంటూ జనంలో వెతికాడు. అంటే, విజయ్‌కి చెప్పకుండానే రాశీఖన్నా ఈవెంట్ నుండి చెక్కేసిందన్న మాట. దాంతో, సోషల్ మీడియాలో రాశీఖన్నాను నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఇంత బుపు ప్రదర్శించాలా.? కాస్త ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, వర్స్ డే సందర్భంగా ‘వరల్డ్ ఫేమస్ వర్’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.