అక్కినేని బుల్లోడు నాగచైతన్య - మలర్ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్‌కి తగ్గట్లుగా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా కథని పూర్తిగా సాయి పల్లవి యాంగిల్ నుండే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఏ సినిమాలో ఉన్నా, కథనీ, హీరోని డామినేట్ చేసేలానే ఉంటుంది ఆమె పాత్ర. అవతల ఎంతటి మహానటులున్నా సరే, సాయి పల్లవి ముందు చిన్నబోవాల్సిందే. తెలుగులో తీసుకుంటే, వరుణ్ తేజ్, నాని, శర్వానంద్ తదితర హీరోలతో పాటు, తమిళ స్టార్ హీరో ధనుష్‌నే రౌడీ బేబీ అంటూ డామినేట్ చేసేసింది సాయి పల్లవి.
ప్రస్తుతం రానాతో ఓ పక్క 'విరాటపర్వం' సినిమాలో నటిస్తూనే, మరో పక్క చైతూతో జతకడుతోంది. అసలే లవ్ స్టోరీస్‌ని తెరకెక్కించడంలో దిట్ట అయిన శేఖర్ కమ్ముల ఈ సినిమాలో లవ్ స్టోరీని చాలా పొయెటిగ్గా, హృద్యంగా తెరకెక్కించబోతున్నాడట. ఇంకేముంది, హృద్యమైన కథలకు సాయి పల్లవి ప్రాణం పెట్టేయదు. ఇక పక్కనున్న చైతూ పరిస్థితేంటో కానీ, సాయి పల్లవి ముందు చైతూ తేలిపోతాడేమో అనుకుంటున్నారంతా. అయితే, 'మజిలీ', వెంకీ మామ' చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి, చైతూ కూడా మాంచి జోరు మీదున్నాడు.
'ప్రేమమ్' తదితర లవ్ స్టోరీస్‌లో చైతూ కూడా తనదైన శైలి నటన కనబరిచిన సంగతి తెలిసిందే. సో చైతూ - సాయి పల్లవి పోటా పోటీగా నటించబోతున్నారట. ఈ సినిమాని సమ్మర్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాతో రెహ్మన్ శిష్యుడు సి.హెచ్ పవన్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. క్యూట్ లవ్‌స్టోరీకి తగ్గట్లుగా స్వీట్ మెలోడీ ట్యూన్స్‌ని ఈ కొత్త సంగీత దర్శకుడు సిద్ధం చేస్తున్నాడట.