సమ్మర్‌ సెగలు మరింత పెంచేస్తోన్న 'సావిత్రి'!

మరిన్ని వార్తలు

ఓ పక్క భానుడి భగభగలు తట్టుకోలేకపోతున్న జనానికి, మరోపక్క సోషల్‌ మీడియాలో ముద్దుగుమ్మల గ్లామర్‌ మిసమిసలు పెద్ద తలనొప్పే తెచ్చిపెడుతున్నాయి. ఒకరిని మించి ఒకరు గ్లామర్‌తో పిచ్చెక్కించేస్తుంటే, తానేం తక్కువ కాదంటూ, మన క్యూట్‌ సావిత్రి అదేనండీ రాశీఖన్నా.. 'జిల్‌' సినిమాలో అమ్మడి పేరు సావిత్రి కదా.. ముద్దుగుందిలే అని వాడేసుకున్నాంలే ఏమీ అనుకోండి. అసలు వివరాల్లోకి వెళితే, రాశీఖన్నాకి గ్లామర్‌ టచ్‌ కూసింత ఎక్కువే. ఫేస్‌లో క్యూట్‌ అప్పీల్‌ ఉన్నా, ఫిజిక్‌లో హాట్‌ అప్పీల్‌ కూడా పుష్కలంగా ఉంటుందీ ముద్దుగుమ్మలో.

 

అందుకే తాజాగా సోషల్‌ మీడియాలో హాట్‌ క్లీవేజ్‌ ఫోటో సెషన్‌ చేయించుకుని కుర్రకారును తన ప్రేమలోతుల్లో దించేసే ప్రయత్నమేదో చేపట్టింది. ఈ సోషల్‌ సేవకు మెచ్చిన నెటిజన్లు అమ్మడి హాట్‌ పోజులకు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ ఇస్తున్నారు మరి. 'తొలిప్రేమ' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి టాప్‌ రేంజ్‌కి వెళుతుందనుకున్న టైంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో చతికిలపడింది. అయినా ఆఫర్లకేం లోటు లేదులెండి. ఇటు తమిళంలోనూ, అటు తెలగులోనూ కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇటీవల విశాల్‌తో 'అయోగ్య' సినిమాతో హిట్‌ కొట్టింది. తెలుగు 'టెంపర్‌'కి తమిళ రీమేక్‌ ఇది. మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోందిప్పుడు. ఇక తెలుగు విషయానికి వస్తే, 'వెంకీ మామ' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. మరోవైపు సంచలన హీరో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తోంది అందాల రాశీఖన్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS